ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'యువత కడుపు మంటతో రోడ్డెక్కితే అవహేళన చేస్తారా..?'

ఎన్నికల హామీలే వైకాపాకు భస్మాసుర హస్తంగా మారుతున్నాయని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. జగన్ చేసిన మోసం భరించలేకే నిరుద్యోగులు ఆయన ఇంటిని ముట్టడించారు దుయ్యబట్టారు. యువత కడుపు మంటతో రోడ్డెక్కితే అవహేళన చేయటం సరికాదన్నారు.

ashok babu comments cm jagan on job calander
ashok babu comments cm jagan on job calander

By

Published : Jul 20, 2021, 12:41 PM IST

మోసపూరిత ఎన్నికల హామీలే.. వైకాపాకు భస్మాసుర హస్తంగా మారుతున్నాయని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. ఉద్యోగాల కల్పనలో వైకాపా ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహం, మోసం భరించలేకే నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం 5.80లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికార పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అసత్యాలు చెప్పటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా అన్ని ఉద్యోగాలు కల్పించి ఉంటే యువతకు సీఎం ఇల్లు ముట్టడించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

నిరుద్యోగులు ఉద్యమంచేస్తే తప్ప, వాస్తవాలు బోధపడని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు దుయ్యబట్టారు. కడుపు మంటతో రోడెక్కిన యువతను అవహేళన చేస్తే, 151 సీట్లున్న ప్రభుత్వం కూడా పేకమేడలా కూలిపోవటం ఖాయమని హెచ్చరించారు. సీఎం జగన్ చేసిన మోసం భరించలేకే.. నిరుద్యోగులు ఆయన నివాసాన్ని ముట్టడించారన్నారు. నిరుద్యోగులు ఉద్యమం చేస్తే తప్ప ప్రభుత్వానికి వారి బాధ పట్టదా అని ప్రశ్నించారు. విద్యార్థులు, యువత కడుపు మంటతో రోడ్డెక్కితే అవహేళన చేస్తారని అశోక్‌బాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details