ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ రక్షణ లేకుండా పోయింది ' - ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల వార్తలు

Ashok Babu on GPF: రాష్ట్రంలో ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల డబ్బు మాయమైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు మాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అశోక్ బాబు
అశోక్ బాబు

By

Published : Jun 29, 2022, 1:39 PM IST

Updated : Jun 29, 2022, 2:25 PM IST

TDP leaders fire on YSRCP: ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అశోక్​బాబు ఆరోపించారు. 800 కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్మును ఎవరు వాడుకున్నారు అనేది స్పష్టత లేకుండా పోయిందని విమర్శించారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా.. వారు దాచుకున్న సొమ్ములు కూడా మాయం కావడం ఏపీలో తప్ప ఎక్కడ జరగదని అశోక్ బాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే రూ.800 కోట్ల డబ్బు మాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

'ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ రక్షణ లేకుండా పోయింది '

జైలుకు వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మికి ప్రమోషన్లు ఇచ్చారని.. ఏబీ వెంకటేశ్వరరావుకి ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చి, సస్పెండ్ చేశారని మాజీ మంత్రి కె.ఎస్‌. జవహర్‌ మండిపడ్డారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సీఎం చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లో కొందరికి ప్రభుత్వం నుంచి గిఫ్టులు వెళ్తున్నాయన్న జవహర్‌... అందుకే వారు ప్రభుత్వాన్ని పొగుడుతూ తెదేపాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 29, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details