Asha Workers: విశాఖ ఏజెన్సీలో ఆశా కార్యకర్తలకు ప్రాథమిక విద్యపై పరీక్ష నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాడేరులోని నాలుగు సెంటర్లలో సుమారు 800 మంది ఆశా కార్యకర్తలు ఈ పరీక్షకు హాజరయ్యారు. అసలే చదువురాని తాము.. పరీక్ష ఎలా రాయాలో తెలియక అవస్థలు పడుతున్నామని అంటున్నారు. మొదట్లో చదువు అవసరం లేకుండానే తీసుకున్నారని.. ఇప్పుడు పరీక్షలు పెడితే ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో 3 వేల 200 మంది ఆశా కార్యకర్తలు ఉన్నమని.. తమ పొట్టకొట్టడానికి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.
Asha Workers: చదువు అవసరం లేదని చెప్పి, ఇప్పుడు పరీక్షలు పెడితే ఎలా? ఆశా కార్యకర్తల ఆవేదన - latest news about asha workers exam
Asha Workers Exam: విశాఖ ఏజెన్సీలో ఆశా కార్యకర్తలకు ప్రాథమిక విద్యపై పరీక్ష నిర్వహణపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో చదువు అవసరం లేకుండానే తీసుకున్నారని.. ఇప్పుడు పరీక్షలు పెడితే ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు.
![Asha Workers: చదువు అవసరం లేదని చెప్పి, ఇప్పుడు పరీక్షలు పెడితే ఎలా? ఆశా కార్యకర్తల ఆవేదన Asha Workers Exam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14653043-592-14653043-1646560078473.jpg)
ఆశా కార్యకర్తలకు ప్రాథమిక విద్యపై పరీక్ష
ఆశా కార్యకర్తలకు ప్రాథమిక విద్యపై పరీక్ష నిర్వహణపై సర్వత్ర విమర్శలు