తెలంగాణలోని నల్లగొండ జిల్లా పెద్దవుర మండల కేంద్రంలో తెరాస పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూంధాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్, అభ్యర్ది నోముల భగత్ హాజరయ్యారు.
తెలంగాణ: ఎన్నికల ప్రచారంలో కన్నీరు పెట్టుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి - Minister Jagadish Reddy wept to tears
నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నల్లగొండ జిల్లా పెద్దవుర మండల కేంద్రంలో తెరాస ధూంధాం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్, అభ్యర్ది నోముల భగత్ హాజరయ్యారు.
వేదికపైనే కన్నీరు పెట్టుకుంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి
అనంతరం ఇటీవల మరణించిన పెద్దవూర గ్రామ సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మంత్రి జగదీశ్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి బాధపడ్డ తీరు ఇటు వేదిక మీద ఆశీనులైన వారితో పాటు ఆహుతులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి:నేటి నుంచి తిరుపతిలో చంద్రబాబు ప్రచారం