అంతర్జాలం, చరవాణులు, సాంకేతికతతో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల యుగం నడుస్తోంది. ఏ దుకాణానికి వెళ్లినా... చివరకు పాన్‌షాపులోనూ డిజిటల్ చెల్లింపు కోసం అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాగా మొహర్రం వేడుకల్లో ప్రదర్శనలు చేసే పులి వేషాధారణకు చెల్లించేందుకు కూడా పేటీఎం బోర్డు మెడలో వేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
DIGITAL PAYMENT: పేటీఎం బోర్డుతో పులి వేషగాళ్లు - తెలంగాణ వార్తలు
ప్రస్తుతం ఆన్‌లైన్(online payments) చెల్లింపులు పెరిగాయి. అయితే చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్దమొత్తంలోనూ ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తున్నారు. కాగా మొహర్రం సందర్భంగా వివిధ వేషాలను ధరించిన కళాకారులు సైతం పేటీఎం(pay tm) చేయొచ్చని బోర్డు ప్రదర్శించడం ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడంటే...!
పేటీఎం బోర్డుతో పులి వేషగాళ్లు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో వివిధ వేషాధారణల్లో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకుంటే పేటీఎం చేయండి అంటూ ఓ బోర్డును ప్రదర్శించడం గమనార్హం. కొద్దిమొత్తం అయినా డిజిటల్ పేమెంట్ చేయొచ్చు కళాకారుల అనే ప్రదర్శన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి:యుద్ధ విమానంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య