రైతన్నలకు వాతావరణశాఖ తీపి కబురందించింది. నైరుతి రుతు పవనాలు మరో నాలుగు రోజుల్లో అండమాన్ తలుపు తట్టబోతున్నట్లు సూచించింది. ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, సుమత్రా తీరప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో మే 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 72 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది.
రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్! - latest news of southwest monsoon winds
నైరుతి రుతు పవనాలు మరో నాలుగు రోజుల్లో అండమాన్ తలుపు తట్టబోతున్నట్లు సూచించింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
![రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్! southwest-monsoon-winds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7160084-733-7160084-1589245803405.jpg)
southwest-monsoon-winds
ఉత్తరాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన
ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుంది.