కొవిడ్ బారిన పడిన వారికి అందించాల్సిన ఔషదాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కొంత మంది అక్రమార్కులు. ఒక వైపు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ... ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాచిగూడలోని ఓ ఔషద దుకాణం యజమాని రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను రూ.30 వేల రూపాయలకు విక్రయిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుపడ్డాడు.
బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ విక్రయం.. నిందితుడి అరెస్ట్ - రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ తాజా వార్తలు
బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ విక్రయిస్తున్న ఓ ఔషద దుకాణం యజమానిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ విక్రయం.. నిందితుడి అరెస్ట్
తెలంగాణ కాచిగూడ నింబోలిఅడ్డా ప్రాంతంలో సుమ ఫార్మసీ ఔషద దుకాణం నిర్వహిస్తున్న శ్రీహరి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.30 వేల రూపాయలకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతనిపై నిఘా ఉంచి బస్టాండ్‌లో ఉన్న సమయంలో పట్టుకున్నారు. విచారించగా అధిక ధరలకు ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్టు తేలింది. శ్రీహరి నుంచి నాలుగు ఇంజక్షన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య