ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bhadradri Temple: సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం - ts news

Bhadradri Temple: రాములోరి కల్యాణానికి ఘడియలు దగ్గరపడుతున్న వేళ.. భద్రాద్రి దివ్య క్షేత్రం శ్రీరామనామస్మరణతో మారుమోగుతోంది. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ వైభవాన్ని కనులారా చూసేందుకు.. రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతించిన వేళ.. భద్రాచలం పురవీధులు సీతారాముల కల్యాణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో.. నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఎదుర్కోలు మహోత్సవం ఇవాళ సాయంత్రం జరగనుండగా.. కమనీయమైన జగదభి రాముడు - సీతమ్మదేవి కల్యాణమహోత్సవం ఆదివారం జరగనుంది.

sriramanavami celebrations in bhadrachalam
sriramanavami celebrations in bhadrachalam

By

Published : Apr 9, 2022, 7:29 AM IST

సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం

Bhadradri Temple: దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రం శ్రీ రామస్మరణతో పులకించిపోతోంది. లోక కల్యాణంగా భావించే జగదభి రాముడి జగత్ కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు భద్రాద్రి రామయ్య క్షేత్రానికి ఈ సారి భారీగా తరలిరానున్నారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేకుండానే సాగిన రాములోరి కల్యాణం.. ఈ సారి అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 2న మొదలైన తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. సకల హంగులతో నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవం.. సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా భద్రాద్రి దివ్వక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కల్యాణ మహోత్సవానికి ముందు రోజు నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవానికి మిథిలా మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ముస్తాబవుతున్న ఆలయ పరిసరాలు.. ఇక తిరుకల్యాయణ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన శ్రీ సీతారాముల వారి కల్యాణ వేడుకను ఆద్యంతం వైభవోపేతంగా నిర్వహించేందుకు భద్రాచలం పరిసరాలన్నీ ముస్తాబవుతున్నాయి. కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. ఎటుచూసినా స్వాగత ద్వారాలతో భద్రాచల పురవీధులు కళకళలాడుతున్నాయి. కల్యాణ వేదిక చుట్టూ చలువ పందిళ్లతో సిద్ధం చేస్తున్నారు. వీఐపీల తాకిడి అధికంగా ఉండే నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 లక్షల లడ్డూలు, 2.50 లక్షల తలంబ్రాలు ప్యాకెట్లను అధికారులు సిద్ధం చేశారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 60 తలంబ్రాల కౌంటర్లు, 25 ప్రసాదాల కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. 1400 మందికి పైగా పోలీసులు.. బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

పట్టాభిషేకం వేడుకలో పాల్గొననున్న గవర్నర్: రేపు నిర్వహించే సీతారాముల వారి కల్యాణ క్రతువుకు.. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 11న నిర్వహించే పట్టాభిషేకం వేడుకలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పాల్గొనున్నారు.

ఇదీ చదవండి:నేటి నుంచే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. స్వామివారి కల్యాణానికి హాజరుకానున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details