ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

tankbund : గణపతి నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్న ట్యాంక్ బండ్ - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలో హైదరాబాద్ నగరం గణపతి నిమజ్జనోత్సవాలకు సిద్ధమైంది. హుస్సేన్ సాగర్​ వద్ద గణపతి నిమజ్జనోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు (arrangements for immersion). ఈ ఒక్క ఏడాదికే అనుమతి ఉండడం వల్ల అధికారులు నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

arrangements-for-immersion-at-hussain-sagar
గణపతి నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్న ట్యాంక్ బండ్

By

Published : Sep 17, 2021, 2:18 PM IST

తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఆదివారం జరగనున్న నిమజ్జనోత్సవానికి ఆ రాష్ట్ర అధికారులు ముస్తాబుచేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదికే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి (immersion) అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. మునుపటి కార్యాచరణకు సవరణలు చేశారు. నగరంతోపాటు చుట్టుపక్కల నిమజ్జనం కోసం పోలీసులు 27,955 మంది సిబ్బందిని నియమించారు.

జీహెచ్‌ఎంసీ నుంచే 8వేలకుపైగా అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. దాదాపు 33 ప్రాంతాల్లో 300 క్రేన్లు, వంద మంది గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. పడవలు, నిమజ్జన కేంద్రాల వద్ద విద్యుద్దీపాలు, ఇతర ఏర్పాట్లకు అధికారులు గురువారం తుదిఆమోదం తెలిపారు.

19న శోభాయాత్ర

ఈసారి 303.3 కి.మీ. పొడవున శోభాయాత్ర జరగనుందని అంచనా. ఆయా మార్గాల్లో జీహెచ్‌ఎంసీ గణేష్‌ యాక్షన్‌ టీం(జీఏటీ)లు పనిచేస్తాయి. జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం విభాగం ఆధ్వర్యంలో 33 ప్రాంతాల్లోని నిమజ్జన కేంద్రాల వద్ద 172 క్రేన్లు ఏర్పాటు చేయనుంది. చుట్టుపక్కల ఉన్న 25 చెరువులు, 25 నిమజ్జన కోనేరుల వద్ద మరో 123 క్రేన్లు ఏర్పాటు చేశారు. రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రెండుపొరల ఇనుప జాలీ 12 కి.మీ పొడవునా ఏర్పాటు చేయనున్నారు. జలమండలి ఆధ్వర్యంలో 101 ప్రాంతాల్లో తాగునీటి ప్యాకెట్ల వితరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆదివారం జరిగే నిమజ్జనోత్సవాన్ని భక్తిభావంతో చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. సాగర్‌ చుట్టూ 24 అత్యాధునిక క్రేన్లను పెట్టాం. భక్తులకు తాగునీటితోపాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రధాన నిమజ్జనం ఈ నెల 18న ప్రారంభమవుతుంది.

వచ్చే ఏడాది నుంచి మండపంలోనే

వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్​ (Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిర్వహకులు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించనున్నట్లు కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.

మట్టి వినాయకున్ని ఇక మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నారు. పీవోపీ విగ్రహాలతో నీటి కాలుష్యం అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. మండపంలోనే నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించడంతో ఇక మహా గణపతి శోభాయాత్ర ఉండదని తెలుస్తోంది.

సుప్రీం తీర్పుతో ఊరట

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి... సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి... ఈ ఏడాదికే మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టంచేసింది. హైదరాబాద్‌లో చాలా ఏళ్ల నుంచి నిమజ్జనం సమస్య ఉందన్న సుప్రీంకోర్టు.. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదని పేర్కొంది. ఏటా ఎవరో ఒకరు కోర్టుకు వస్తున్నారన్న న్యాయస్థానం... నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వ తీరు సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించింది. సుందరీకరణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారన్న సుప్రీంకోర్టు పీవోపీ ఈ ఒక్క ఏడాదికే ప్లాస్టర్​ ఆఫ్ ప్యారిస్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

ఇదీ చూడండి:Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీం అంగీకారం

ABOUT THE AUTHOR

...view details