జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు.. నామినేషన్ల పరిశీలన ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా ఆయా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రకటిస్తారు. కాసేపట్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఒంటిగంట తర్వాత.. కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ఆ వెంటనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత ZPఛైర్మన్లు, ఇద్దరు వైస్‌ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయా ZP కార్యాలయాల్లో స్థానిక జడ్పీటీసీలందరూ సమావేశమై జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ఎన్నుకుంటారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని జిల్లాల్లోని ZP పదవులకు వైకాపా అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవులు అధికార వైకాపానే దక్కించుకోనుంది. రిజర్వేషన్లు అనుసరించి..ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు. మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసంతృప్తికి తావులేకుండా సభ్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా చూసుకోవాలని పార్టీ నేతలను జగన్ ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం.
జిల్లా | జడ్పీ ఛైర్మన్/ఛైర్‌పర్సన్ |
---|---|
శ్రీకాకుళం | పిరియా విజయ |
విజయనగరం | మజ్జి శ్రీనివాస్ |
విశాఖపట్నం | అరిబీరు సుభద్ర |
తూర్పుగోదావరి | విప్పర్తి వేణుగోపాల్ |
పశ్చిమగోదావరి | కౌరు శ్రీనివాస్ |
కృష్ణా | ఉప్పాళ్ల హారిక |
గుంటూరు | క్రిస్టినా |
ప్రకాశం | బూచేపల్లి వెంకాయమ్మ |
నెల్లూరు | ఆనం అరుణమ్మ |
కర్నూలు | వెంకట సుబ్బారెడ్డి |
చిత్తూరు | వి. శ్రీనివాసులు |
కడప | ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి |
అనంతపురం | గిరిజ |