చలికి తట్టుకోలేక విధి నిర్వహణలో ఉన్న జవాను ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా జామి మండలం పాతభీమసింగికి చెందిన పాండ్రంగి చంద్రరావు (42) 17 ఏళ్ల కిందట ఆర్మీలో చేరారు. ప్రస్తుతం లద్దాఖ్‌లోని 603-ఈఎంఈ బెటాలియన్‌లో నాయక్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం లద్దాఖ్‌కు 20 కి.మీ.ల దూరంలోని బింగాలక అనే మంచు ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగా, చలికి తట్టుకోలేక కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. మృతదేహాన్ని రెండు రోజుల్లో భీమసింగికి తీసుకురానున్నారు. చంద్రరావు తల్లిదండ్రులు మరణించగా, భార్య సుధారాణి ఇద్దరి పిల్లలతో విశాఖలో ఉంటున్నారు.
చలికి తట్టుకోలేక విధుల్లో జవాను మృతి
చలికి తట్టుకోలేక విధి నిర్వహణలో విజయనగరం జిల్లాకు చెందిన జవాన్ పాండ్రంగి చంద్రరావు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని రెండు రోజుల్లో భీమసింగికి తీసుకురానున్నారు.
army jawan from vizianagaram dies of severe cold wave