మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ న్యాయస్థానంలో నేడు వాదనలు జరగనున్నాయి. ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో భార్గవరామ్ ఏ3 నిందితుడిగా ఉన్నారు. కిడ్నాప్ జరిగిన రోజు నుంచి ఆయన పరారీలో ఉన్నారు. భార్గవరామ్ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు నిర్వహిస్తున్నారు.
భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు - Bhargav Ram Preliminary Bail Petition
సంచలనం రేపిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏ3గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి.
ఈ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని.... ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భార్గవరామ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైనా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సికింద్రాబాద్ న్యాయస్థానం, పోలీసులను ఆదేశించింది. అఖిలప్రియ, విఖ్యాత్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నారు.
ఇదీ చూడండి:సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలి: కోమటిరెడ్డి