మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూముల విక్రయంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆస్తులను అమ్ముకుని ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జరుగుతున్న ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని నివారించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్ల నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ చేస్తోంది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా సమయంలో అధిక ధరకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిన మందుబాబులకు కృతజ్ఞతలు చెప్పాలిందేనని వ్యాఖ్యలు చేసింది.
ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు - మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూముల విక్రయం తాజా వార్తలు
రాష్ట్రంలో ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవలసిన పని ఉందా.. అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట జరుగుతున్న భూముల విక్రయంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని అడిగిన ధర్మాసనం.. కరోనా సమయంలో ఎక్కువ రేటు పెట్టి మద్యం కొనుగోలు చేసిన జనాలకు ప్రభుత్వం కృతజ్ఞతలు చెప్పాలని వ్యాఖ్యలు చేసింది.

Arguments in the High Court
దేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం చేస్తోందని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా.. మీరెంత బాగా చేస్తున్నారో అందరికి తెలుసని హైకోర్టు పేర్కొంది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జరుగుతున్న ప్రభుత్వం ఆస్తుల అమ్మకాన్ని నివారించాలని 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 17కి వాయిదా పడింది.
డీఎస్ ఎన్వీ ప్రసాద్ బాబు , న్యాయవాది
ఇదీ చదవండి;అంగళ్లలో ఉద్రిక్తత...తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి
Last Updated : Dec 11, 2020, 7:03 PM IST
TAGGED:
hc on mission