ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ANANDAYYA: 'జౌషధ అనుమతి' పురోగతిపై వివరాలివ్వండి: హైకోర్టు

కొవిడ్ చికిత్సకు అందించే జౌషధం అనుమతి పొందే విషయంలో పురోగతి చెప్పాలని ఆనందయ్యను హైకోర్టు ఆదేశించింది. జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

anandayya medicine
anandayya medicine

By

Published : Aug 25, 2021, 9:13 AM IST

కొవిడ్ చికిత్సకు అందించే మందుకు అనుమతి పొందే విషయంలో పురోగతి ఏమిటో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయుర్వేద ఔషధ నిపుణుడు అనందయ్యను హైకోర్టు ఆదేశించింది . మందుకు అనుమతిచ్చే విషయంలో జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొవిడ్​కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధాల పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు .

మరోవైపు ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద / సంప్రదాయ మందు పంపిణీ కార్యక్రమం కొనసాగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి. కంటి చుక్కల మందుకు పునఃపరీక్ష చేసేందుకు రాష్ట్ర ఆయూష్ శాఖ అధికారులు నమూనాలు తీసుకున్నారని ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టుకు తెలిపారు. లైసెన్స్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు. ఎటువంటి నమూనాలు సేకరించలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ అన్నారు. ఇరువురు న్యాయవాదులు పరస్పర విరుద్ధమైన వివరాలు సమర్పించడంతో ధర్మాసనం స్పందిస్తూ.. కొవిడ్ మందుకు అనుమతి పొందే విషయంలో పురోగతిపై వివరాలు సమర్పించాలని ఆనందయ్య తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. మందుకు అనుమతిచ్చే విషయంలో జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

ఇదీ చదవండి:SC Commission: గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ

ABOUT THE AUTHOR

...view details