ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్ (ఐబీపీఎస్)ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలన్నింటికీ ఒకటే ప్రాథకమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు సాధించిన స్కోరు ఆధారంగా తర్వాతి దశ నియామక ప్రక్రియను ఆయా సంస్థలు తమ పద్ధతుల్లో కొనసాగిస్తాయి.
ఇప్పటి వరకు పలు సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ పరీక్షల స్థానంలో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ స్కోర్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఆయా సంస్థలు తర్వాతి దశ పరీక్షలు జరిపి నియామకాలు పూర్తి చేస్తాయి. విద్యార్థి జీవితంలోని అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ఈ పరీక్షను రూపొందించాలని భావిస్తున్నారు. పరీక్షను ఏడాదికి రెండుసార్లు జరుపుతారు. అభ్యర్థులు సాధించిన స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. మొదట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సంస్థలకు ఈ సంయుక్త పరీక్షను పరిమితం చేయనున్నారు. ఇక మీదట ఈ మూడు సంస్థలు నిర్వహించే వివిధ రకాల పరీక్షలకు వేర్వేరుగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు. సెట్ ఒక్కదానితోనే అభ్యర్థుల వడపోత జరుగుతుంది. ప్రతి పరీక్షకు వేర్వేరు సిలబస్‌లను ప్రిపేర్ కావడం, ఒత్తిడి, వ్యయాలను తగ్గించడమే ఈ సెట్ నిర్వహణ ప్రధాన లక్ష్యం.
ఎవరు నిర్వహిస్తారు?
సెట్ నిర్వహణతో నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర మంత్రివర్గం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇది ప్రతి సంవత్సరం సెట్ నిర్వహించడానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఇక మీదట నాన్-గెజిటెడ్ పోస్టుల నియామకాల కోసం వివిధ ఏజెన్సీలు ప్రిలిమ్స్ స్థాయి పరీక్షలు నిర్వహించవు. గ్రూప్ బి, సి పోస్టులన్నింటికీ కలిపి ఒకే సాధారణ అర్హత పరీక్ష ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక జిల్లాలో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మంది అభ్యర్థులకు ఈ పరీక్ష వరంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల వారు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పరీక్ష ఫీజులు, ప్రయాణ ఛార్జీలు, వసతి, ఇతర పలు రకాల ఖర్చులు మిగులుతాయి. పూర్తి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
అర్హతలు?
ప్రస్తుతం ఆయా నియామక సంస్థలు వివిధ పరీక్షల కోసం పేర్కొన్న కనీస అర్హతలు తప్పకుండా ఉంటాయి. అంటే గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, పదో తరగతి మొదలైన అర్హతల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వయసు పరిమితి తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది.
పరీక్ష విధానం ఏమిటి?
సెట్ సిలబస్, పరీక్ష స్వరూపానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పోస్టుల కనీస అర్హతల ఆధారంగా పరీక్ష స్థాయి ఉంటుంది. ఆయా పరీక్షల సిలబస్‌లోని కామన్ అంశాలను ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ మొదలైనవి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రిపరేషన్ ఎలా?