తెలంగాణ సీఎంను తప్పుపడుతూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహిళలు రాత్రి 8గంటల కల్లా ఇంటికి రావాలని కేసీఆర్ అన్నారని... ఆ మాటలపై రేఖాశర్మ తీవ్రంగా మండిపడ్డారు. క్షేమంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండేందుకు మహిళలు ఏమైనా జీవిత ఖైదీలా? అని ప్రశ్నించారు. ఇంట్లోనే ఉంటే మహిళలపై నేరాలు జరగడం లేదా? అన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనూ మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ విషయాలను తెలంగాణ సీఎంకు చెప్పాలని ట్వీట్ చేశారు.
వాస్తవాలు తెలుసుకోండి...