AR Constable Suicide : తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిశ్చితార్థానికి ముందే లాడ్జిలో ఉరేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ అశోక్‌కుమార్ బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ నెల 8న లాడ్జిలో రూమ్ తీసుకున్న అశోక్‌కుమార్... ఇవాళ విగతజీవిగా ఉన్నాడు. రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూడగా... ఉరి వేసుకుని చనిపోయాడని తెలిపారు.
AR Constable Suicide : నిశ్చితార్థానికి ముందు కానిస్టేబుల్ ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
నిశ్చితార్థానికి ముందు ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది.
కానిస్టేబుల్ అశోక్ కుమార్ స్వస్థలం ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురం. 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికైన అశోక్‌కుమార్... కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలో పని చేశాడు. పోలీస్ శాఖలో బదిలీల్లో భాగంగా ములుగు జిల్లాకు అశోక్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇవాళ ఆయన నిశ్చితార్థం జరగనుండగా ఈ ఘటనకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొడుకు... ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణ కుటుంబ ఆత్మహత్య కేసు.. సెల్ఫీ వీడియో బహిర్గతం