ఇప్పటివరకు ఇంజినీరింగ్,డిగ్రీ,వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే పరిమితమైన నైపుణ్యాభివృద్ధిని గ్రామీణ ప్రాంతాలకు పరిచయం చేసేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిద్ధమైంది.గ్రామీణులను శక్తిమంతులుగా తీర్చే ఉద్దేశంతో హెచ్‌పీ సంస్థ...వరల్డ్ ఆన్ వీల్స్ అనే భావనతో ముందుకొచ్చింది.నైపుణ్యరథం పేరుతో ఓ బస్సుని తయారుచేసి.... 20కంప్యూటర్లు,ప్రింటింగ్ సౌకర్యం,ఈ-లెర్నింగ్ టూల్స్ అందుబాటులో ఉంచింది.తొలివిడతలో ఆరు జిల్లాల్లో ఈ రథం సేవలు అందించనుంది.గుంటూరు,ప్రకాశం,నెల్లూరు,అనంతపురం,చిత్తూరు,కర్నూలులో వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి.ప్రతి జిల్లాలో కనీసం5గ్రామాల్లో....వెయ్యి మందికి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
3 విభాగాలుగా సేవలు
నైపుణ్యరథం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ....3విభాగాలుగా సేవలు అందించనుంది.ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,నిరుద్యోగ యువత,స్వయం సహాయక సంఘాలకు...వేరువేరుగా శిక్షణ అందించనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తారు.నీరు,పరిశుభ్రత,సైన్స్,టెక్నాలజీ,ఇంజినీరింగ్‌తో పాటు మహిళలు,పిల్లలఆరోగ్యం,పోషకాహారం అంశాలపై అవగాహన కల్పించనున్నారు.