తెలంగాణలో లక్ష కిలోమీటర్లు తగ్గించి బస్సులను నడపడానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది. ఇప్పటికే తెలంగాణ అధికారులతో పలుమార్లు చర్చించిన ఆర్టీసీ అధికారులు..ఎన్ని కిలోమీటర్లు బస్సులు నడపాలనే విషయంపై చర్చించారు. ఇరు రాష్ట్రాలు రోజుకు 1.61 లక్షల కిలోమీటర్ల చొప్పున సమానంగా సర్వీసులు నడపాలని దాదాపు నిర్ణయానికి వచ్చాయి.
తెలంగాణ భూభాగంలో ఏపీఎస్ ఆర్టీసీ 2.60 లక్షల కిలోమీటర్లు నడుపుతుండగా...లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది. అందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్ధత తెలిపింది. కిలో మీటర్లు తగ్గించే ఆంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేందుకు ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. అందులో తెలంగాణ అధికారులతో తాము జరిపిన చర్చల వివరాలను, తెలియాజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆర్టీసీ ఎండి కృష్ణబాబు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఇరు రాష్ట్రాలు సమాన కిలోమీటర్లు తిప్పాల్సి ఉందని...అందుకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.