లాక్డౌన్ సమయంలో బస్సు టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. గడువులోగా టికెట్లు రద్దు చేసుకోలేని ప్రయాణికులకు మరో అవకాశం కల్పించింది. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య ప్రయాణం కోసం టికెట్లు తీసుకున్న ప్రయాణికులు రద్దు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
లాక్డౌన్లో టికెట్లు తీసుకున్న ఆర్టీసీ ప్రయాణికులకు నగదు వాపస్ - ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రీఫండ్
ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. లాక్డౌన్ సమయంలో టికెట్లు రద్దు చేసుకోలేని ప్రయాణికులకు నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరుతోంది.
![లాక్డౌన్లో టికెట్లు తీసుకున్న ఆర్టీసీ ప్రయాణికులకు నగదు వాపస్ refund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8025094-748-8025094-1594739416096.jpg)
ఆర్టీసీ నగదు వాపస్
బుధవారం నుంచి 15 రోజుల్లోపు ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 29 లోపుగా ప్రయాణికులు తమ టికెట్లను బస్టాండ్లు లేదా ఎటీబీ కౌంటర్లో చూపించి రద్దు చేసుకోవచ్చని వివరించారు. ప్రయాణికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:ఇంటర్ బోర్డు ఉద్యోగికి కరోనా.. 19 వరకు కార్యాలయం బంద్
Last Updated : Jul 15, 2020, 2:20 AM IST