ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ. 300 కోట్లు ఇవ్వండి... కేంద్రానికి ఆర్టీసీ అభ్యర్థన - ఏపీఎస్​ఆర్టీసీ తాజా సమాచారం

బస్సులన్నీ డిపోలకే పరిమితమై రాబడి లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీని కేంద్రం ఆదుకోవాలంటూ సంస్థ లేఖ రాసింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాబడిలో కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం అడిగింది.

apsrtc send letter to centre regarding about finance deficit
కేంద్రాన్ని కోరిన ఏపీఎస్​ఆర్టీసీ

By

Published : May 1, 2020, 9:52 AM IST

లాక్​డౌన్​తో కుదేలైన ఆర్టీసీని ఆదుకోవాలంటూ కేంద్రాన్ని సంస్థ యాజమాన్యం కోరింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమై రాబడి పూర్తిగా ఆగిందని నివేదించింది. అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల సంఘం (ASRTU) ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ శాఖకు తమ ఆర్థిక పరిస్థితిని నివేదించింది. 12 వేల బస్సులను సంస్థ నడిపేదని, 52 వేల మంది ఉద్యోగులు ఉన్నారని ఆర్టీసీ తెలిపింది. జీతాలు, వివిధ రుణాలు, వడ్డీలు, ఇతర నిర్వహణ ఖర్చుల భారం, 300 కోట్ల వరకూ ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక సాయం అందించాలని కోరింది. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణా ఉద్యోగులుగా మారారు. వీరికి జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా... రాబడి లో కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

కేంద్రాన్ని కోరిన ఏపీఎస్​ఆర్టీసీ

ABOUT THE AUTHOR

...view details