రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సరిహద్దుల వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. పలుచోట్ల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వారికి గరికపాడు చెక్ పోస్టు వరకు బస్సులు నడుపుతుండగా... కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లే వారికి పంచలింగాల చెక్ పోస్టు వరకు సేవలు అందిస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు చొప్పున అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ సరిహద్దు నుంచి తెలంగాణకు వెళ్లేందుకు బస్సులు లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ సరిహద్దుల వరకు బస్సు సర్వీసులు: ఏపీఎస్ఆర్టీసీ - సరిహద్దుల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల వార్తలు
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సరిహద్దుల వరకు ఏపీఆర్టీసీ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేశారు.
apsrtc