ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునికీకరించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని బస్సుల్లో రిజర్వేషన్ టికెట్ వ్యవస్థ అమలు చేయాలని యోచిస్తుంది. నగదురహిత, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. వినూత్న సేవలతో అధునాతన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్టీసీ ఆధునికీకరణ బాట..30న వెబ్‌సైట్ సేవలు బంద్ - ఏపీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ టికెటింగ్
ఆన్‌లైన్ టికెటింగ్ విధానంలో ఆధునికీకరణకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. అన్ని బస్సుల్లో రిజర్వేషన్ టికెట్ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించింది. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకేసారి 50 వేల మంది ఆర్టీసీ సేవలు పొందేలా వెబ్‌సైట్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఈ కారణంగా 30వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 వరకూ రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్టీసీ ఆధునికీకరణ బాట.. అన్ని బస్సుల్లో రిజర్వేషన్ వ్యవస్థ ఆర్టీసీ ఆధునికీకరణ బాట.. అన్ని బస్సుల్లో రిజర్వేషన్ వ్యవస్థ
ఒకేసారి 50 వేల మంది సేవలు పొందేలా ఆర్టీసీ వెబ్‌సైట్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఆధునికీకరణ వల్ల ఈనెల 30న సర్వర్ తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 30న రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు ఆర్టీసీ వెబ్‌సైట్ సేవలు నిలిపివేయనున్నారు. ఆ సమయంలో టికెట్ బుకింగ్‌లు, రద్దు సౌకర్యం ఉండదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :'ఎస్పీవై పరిశ్రమ గ్యాస్ లీక్ మృతుడి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి'