ఏపీఎస్ఆర్టీసీ కొత్త హంగులతో దూసుకుపోతుంది. కరోనా వ్యాప్తి సమయంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఏపీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ఫోకస్ పెట్టింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకోవడంతోపాటు... ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కార్గో సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటిసారి ఇలాంటి సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది. ఇదే మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రయాణిస్తోంది.
మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్ డెలివరీ సదుపాయాన్ని తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుంచి ఈ కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపించాలన్నా.. వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా.. బస్టాండ్‌లోని కొరియర్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు తమ ఇళ్ల వద్దే సేవలు అందించనున్నారు.