ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే వెబ్ సైట్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. www.apsrtconline.in బదులుగా www.apsrtconline.org.in గా మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇకపై www.apsrtconline.org.in వెబ్ సైట్ ద్వారా రిజర్వేషన్లు చేసుకోవాలని ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ కోరారు. టికెట్ రద్దు చేసుకోవాల్సిన వారు refunds.apsrtc@ gmail.comకు వివరాలు పంపాలని సూచించారు. ప్రయాణికులు ఫిర్యాదులు, సూచనల కోసం 0866 2570005 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌లో స్వల్ప మార్పులు చేసిన ఏపీఎస్ఆర్టీసీ - ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ తాజా వార్తలు
టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌లో ఏపీఎస్ఆర్టీసీ స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటివరకు www.apsrtconline.in లో బుకింగ్ చేసుకుంటుండగా.. ఇకపై www.apsrtconline.org.in లో ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాలని సూచించింది.
టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌లో స్వల్ప మార్పులు