ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SEC: ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు - ఈ నెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

notification for counting of ZPTC AND MPTC votes
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

By

Published : Sep 16, 2021, 11:51 PM IST

Updated : Sep 17, 2021, 3:28 AM IST

23:48 September 16

PARISHAT ELECTION @TAZZA

జెడ్పీటీసీ, ఎంపీటీసీ(zptc, mptc) ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్(SEC) తెలిపింది. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్​తో.. ఎస్​ఈసీ నీలం సాహ్ని సమావేశం కానున్నారు.

జెడ్పీడీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ(sec) నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 8న ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియ హడావుడిగా నిర్వహించారని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికలను రద్దు చేస్తూ.. మే 21న తీర్పు ఇచ్చారు. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ....ఎస్​ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పును రిజర్వు చేసింది. ఓట్లు లెక్కింపునకు అనుమతిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. 10 వేల47 ఎంపీటీసీ స్థానాల్లో 2వేల 371 ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు 126 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి..

Last Updated : Sep 17, 2021, 3:28 AM IST

ABOUT THE AUTHOR

...view details