APSRTC:సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలకు 6 వేల 970 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. పండుగ ముందు 4,145 బస్సులు, పండుగ తర్వాత తిరుగు ప్రయాణానికి 2,825 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ కు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి.. పలు ప్రాంతాల నుంచి అక్కడికి 2,500 బస్సులు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. పండుగ ముందు, తర్వాత రోజుల్లో ఈ బస్సులు నడువనున్నాయి. చెన్నై కి 120, బెంగళూరు 300, విజయవాడ కు 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి 850 బస్సులు, ఇతర ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.
APSRTC: ఈ నెల 8 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు...50శాతం అదనపు ఛార్జీలు!
APSRTC: ఈ నెల 8 నుంచి 17 వరకు ఏపీఎస్ఆర్టీసీ... ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను ఆర్టీసీ వసూలు చేయనుంది.
ఈ నెల 8 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు