ఏపీపీఎస్సీ ఇకపై నిర్వహించే అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరపాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి ట్యాబ్‌ల ద్వారానే పోటీ పరీక్షలను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఇటీవలే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించగా...పరీక్ష నిర్వహణ, భద్రత సహా సాంకేతిక అంశాలపై సానుకూలత వ్యక్తమైంది. దీంతో శాశ్వతంగా ఈ విధానమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు లీకయ్యే అవకాశమే ఉండదని అధికారులు భావిస్తున్నారు. అన్ని రకాల నోటిఫైడ్ పోస్టులకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలో అమల్లోకి తేనున్నట్లు చెప్పారు.
ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ అన్లైన్లోనే - ఏపీపీఎస్సీ పరీక్షలు
ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరుపాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు లీకయ్యే అవకాశమే ఉండదని అధికారులు భావిస్తున్నారు. అన్ని రకాల నోటిఫైడ్ పోస్టులకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలో అమల్లోకి తేనున్నట్లు స్పష్టం చేశారు.
ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ అన్లైన్లోనే