ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం

నేడు, రేపు రాష్ట్రంలోని పలుకేంద్రాల్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీపీఎస్​సీ తెలిపింది. రెండు రోజులు జరిగే ఈ పరీక్షలో మొత్తం 6,195 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం

By

Published : Aug 29, 2019, 5:45 AM IST

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం

నేడు, రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా పరీక్ష జరగనుంది. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్ట భద్రతను ఏర్పాటుచేశామన్నారు. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాల్​టికెట్ తీసుకురావాలని సూచించారు. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన 446 పోస్టులకు.... గ్రూప్​-2 పరీక్షల నోటిఫికేషన్​ను ఏపీపీఎస్​సీ విడుదల చేసింది. మే 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అనంతరం విడుదలైన ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో ప్రధాన పరీక్షకు 6 వేల 195 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. ఆన్​లైన్​ విధానంలో మెయిన్స్ నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details