ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శుభవార్త.. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ - medical officer jobs

appsc logo
appsc logo

By

Published : Sep 28, 2022, 9:59 PM IST

Updated : Sep 28, 2022, 10:38 PM IST

21:53 September 28

Good News: ఏపీపీఎస్సీ వెబ్​సైట్​లో పూర్తి వివరాలు

APPSC Notification: పలు ప్రభుత్వ విభాగాల్లో 269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఆయుష్ హోమియో విభాగంలో 34 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 72 మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ హోమియో విభాగంలో 53 మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ యునాని విభాగంలో 26 మెడికల్ ఆఫీసర్లు నియామకం కోసం ప్రకటన జారీ చేసింది. పలు విభాగాల్లో 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇన్సురెన్స్ మెడికల్ సైన్సెస్ విభాగంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు.

ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎపీపీఎస్సీ కోరింది. దరఖాస్తు తేదీలు సహా నోటిఫికేషన్ల పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 28, 2022, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details