ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Appsc: ఖాళీ అవుతున్నాయ్... ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతాయ్..! - APPSC member Sheikh Salambabu spoke to the media

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు పెరిగుతాయని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాం బాబు వెల్లడించారు. గ్రూప్‌-1 మినహా.. మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ ఉండదని.. ఈ మేరకు ప్రభుత్వం తీర్మానించిందని తెలిపారు.

APPSC member  Sheikh Salambabu
ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు

By

Published : Jul 17, 2021, 7:32 AM IST

Updated : Jul 17, 2021, 8:13 AM IST

ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సభ్యుడు షేక్‌ సలాంబాబు వెల్లడించారు. ఇకపై జారీచేసే నోటిఫికేషన్లలో గ్రూప్‌-1 మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ ఉండదన్నారు. ఈ మేరకు పూర్వ జీఓలను రద్దుచేయాలని కమిషన్‌ సమావేశంలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసినట్లు వెల్లడించారు. ఏపీపీఏస్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

‘2018లో జారీచేసిన నోటిఫికేషన్లలో గ్రూప్‌-1, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపక పోస్టులు మినహా మిగతావాటిని భర్తీచేశాం. ఈ రెండు రకాల పోస్టుల భర్తీ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో నియామకాలు ఇంకా జరగలేదు. ప్రిలిమ్స్‌ లేకుండా ఒకే పరీక్షను నిర్వహించడం వల్ల 3 నెలల్లోనే నియామకాలను పూర్తిచేయొచ్చు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్రూప్‌-2 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ జారీ నాటికి అదనపు పోస్టుల వివరాలు కమిషన్‌కు అందుతాయి. ఇవికాకుండా వివిధ శాఖలకు చెందిన 1,180 (15 నోటిఫికేషన్లు) పోస్టుల ఖాళీల వివరాలు కమిషన్‌ వద్ద సిద్ధంగా ఉన్నాయి. నోటిఫికేషన్లు జారీచేసినా భర్తీకాని పోస్టులు 325 వరకు ఉన్నాయి. వీటి భర్తీకి ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంది. జాబ్‌ క్యాలెండర్‌ అనుసరించి వచ్చే నెలలో ప్రకటనలు ఇస్తాం. ఉద్యోగాల సాధన కోసం ఏపీపీఏస్సీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులపై పోలీసు కేసులు తొలగించాలని కమిషన్‌ తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించాలని ప్రభుత్వానికి కమిషన్‌ కార్యదర్శి లేఖ రాశారు’ - షేక్‌ సలాంబాబు, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు

నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా...

రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు 190, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు-గ్రేడ్‌-3 (దేవాదాయ)-60, హార్టికల్చర్‌ ఆఫీసర్‌-39, తెలుగు రిపోర్టర్లు-5, ఇంగ్లిష్‌ రిపోర్టర్లు-10, మెడికల్‌ ఆఫీసర్లు (యూనాని)-26, హోమియో మెడికల్‌ ఆఫీసర్లు-53, ఆయుర్వేద వైద్యులు-72, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌-9, జిల్లా ప్రజా సంబంధాల అధికారులు-4, ఆయుష్‌ అధ్యాపకులు 27 (హోమియో కళాశాలలకు చెందినవి-24), జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు (రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ) 10, డిగ్రీ కళాశాలలో 5 లెక్చరర్ల పోస్టులు చొప్పున ఖాళీ ఉన్నాయి.

మిగులు పోస్టులు

సిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు-10, ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్లు-1, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు-2, ఎక్సటెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-1-ఛైల్డ్‌ వెల్ఫేర్‌) 19, అసిస్టెంట్‌ కమిషనర్లు (దేవాదాయ శాఖ) 3, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌-5, జూనియర్‌ లెక్చరర్లు (ఇంటర్‌ విద్య)-52, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌-10, గ్రూప్‌-2- 7, డిగ్రీ కళాశాల అధ్యాపకులు-37, అసిస్టెంట్‌ స్టాటస్టికల్‌ ఆఫీసర్‌-30, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-28, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌-48+51, గెజిటెడ్‌ పోస్టులు-17, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సర్వే శాఖ) 06, ఫిషరీస్‌ డెవలప్‌ ఆఫీసర్లు-11, గ్రూప్‌-2 ఉద్యోగాలు 25, మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇదీ చదవండి:

Godavari River Board: తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖ

Last Updated : Jul 17, 2021, 8:13 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details