ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గర్భిణులకు వైఎస్ఆర్ ఆసరా పథకం వర్తింపు - వైఎస్ఆర్ ఆసరా పథకం పై వార్తలు

గర్భిణులకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని వర్తింపచేస్తూ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ప్రసవమైన మహిళలకు ఆర్థిక సాయం అందించనున్నారు.

Application of YSR Support Scheme for Pregnant Women
గర్భిణులకు వైఎస్ఆర్ ఆసరా పథకం వర్తింపు

By

Published : Sep 29, 2020, 4:31 PM IST

గర్భిణులకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ సిఫార్సు మేరకు గర్భిణులకు పథకం విస్తరింపచేస్తూ ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ప్రసవమైన మహిళలకు ఆర్థిక సాయం అందించనున్నారు.

సాధారణ ప్రసవాలకు రూ.5 వేలు ఆర్థికసాయం అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. శస్త్రచికిత్స ద్వారా జరిగిన ప్రసవాలకు రూ.3 వేలు ఆర్థిక సాయం అందించాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details