ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సర్వర్‌ మొరాయింపు.. 'పాస్‌పోర్టు' ఇక్కట్లు - Ameerpet passport office

సర్వర్ మొరాయించడంతో అమీర్‌పేట పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతికలోపం తలెత్తడంతో పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద దరఖాస్తు దారులు బారులు తీరారు.

1
1

By

Published : Jul 25, 2022, 6:30 PM IST

Server Problem: హైదరాబాద్ అమీర్‌పేట్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రం వద్ద.. దరఖాస్తుదారులు ధర్నా చేపట్టారు. సర్వర్‌లు మొరాయించడంతో దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. ఉదయం నుంచి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. దీనితో పాస్ పోర్టు కార్యాలయ సిబ్బందిపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్యాలయ సిబ్బంది వారికి సర్ది చెప్పారు.

సర్వర్‌ మొరాయింపు.. 'పాస్‌పోర్టు' ఇక్కట్లు

దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ కార్యాలయాల్లో సర్వర్లు డౌన్ కావడంతో పాస్ పోర్ట్ల జారీ విషయంలో ఇబ్బందులు తలెత్తినట్లు వారికి వివరించారు. జారీ చేయవలసిన పాస్‌పోర్ట్‌లను తిరిగి సెలవు ఉన్న రోజునే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తామని అధికారులు చెప్పారు. కాగా... పాస్ పోర్టు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని, నిత్యం ఇలా ఏదో ఓ కారణంతో పాస్ పోర్టును పొందలేకపోతున్నామని కొంతమంది దరఖాస్తులు చెబుతుండగా...ఇంకోసారైనా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని మరికొంతమంది దరఖాస్తుదారులు తెలిపారు.

ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం. కనీసం చెప్పే వాళ్లు కూడా లేదు. కొంచెం సేపటికి తెలిసింది సర్వర్ డౌన్ అని. కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు. వాష్ రూమ్స్ లేవు, ఏమీ లేవు... ఈరోజు వర్షం పడలేదు.. లేదంటే ఇంకా ఇబ్బంది పడేవాళ్లం. ఒక పద్ధతి లేదు.. విధానం లేదు. లోపల నుంచి కనీసం సమాచారం ఇచ్చే వాళ్లులేరు. ఎప్పుడవుతుందో తెలియదు. ఎన్ని గంటలు అని వెయిట్ చేస్తాం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details