ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీజీసెట్)-2021 షెడ్యూలును కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి మునగాల సూర్యకళావతి బుధవారం విడుదల చేశారు. తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కళాశాలల్లోని కోర్సులకు ఒకే నోటిఫికేషన్ ద్వారా సీట్లు భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ప్రవేశాల ప్రక్రియ బాధ్యతలను యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. సెట్ కన్వీనరు ఆచార్య వై.నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఉన్న 139 కోర్సులకు ఏపీ పీజీ సెట్ ద్వారా మాత్రమే ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఈనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలు అక్టోబరు 22న జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం www.yogivemanauniversity.ac.in, www.yvu.edu.in, http://sche.ap.gov.inవెబ్‌సైట్లను చూడాలన్నారు.
APPGCET: ఏపీపీజీసెట్ తొలిరోజు పరీక్షల 'కీ' విడుదల
ఏపీపీజీసెట్ తొలిరోజు పరీక్షల 'కీ' విడుదల అయింది. ఆంగ్లం, గణితం, బోటనీ, హ్యుమానిటీస్, సోషల్ కీ ను రాష్ట్ర కన్వీనర్ ఆచార్య నజీర్ అహ్మద్ విడుదల చేశారు. కీ వివరాలను sche.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.
ఏపీపీజీసెట్ తొలిరోజు పరీక్షల కీ విడుదల