తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లుతున్నాయి(heavy rains in hyderabad). గగన్‌పహాడ్ వద్ద అప్పచెరువు అలుగు పారుతోంది. ఆ వరద నీరు హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపై(flood on hyderabad-Bangalore national highway) ప్రవహిస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్ వద్ద అప్ప చెరువు నిండి అలుగు పొంగిపొర్లుతోంది(heavy rain in hyderabad). హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపై అలుగు పారుతోంది. ఈ క్రమంలో శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ఓఆర్‌ఆర్ మీదుగా విమానాశ్రయానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. శంషాబాద్-హైదరాబాద్ మార్గంలో రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
గతేడాది ఐదుగురు
గతేడాది నగరంలో కురిసిన భారీ వర్షాలకు(heavy rain in hyderabad) అప్ప చెరువు కట్ట తెగి... ఆ నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు మృత్యువాత పడ్డారు. కాగా అలుగు నీరు బయటకు పోకుండా వెలిసిన కట్టడాలను తొలగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువపై నిర్మించిన కట్టడాల వల్లే అలుగు నీరు జాతీయ రహదారి మీదకు వస్తోందని వాపోయారు.
జలమయం
గులాబ్ తుఫాను తెలంగాణలోని పలు జిల్లాలను వణికించింది. భారీ వర్షాల(Heavy Rain in Telangana)తో ముంచెత్తింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వాన(Heavy Rain in Telangana) కురిసింది. అధిక వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.
తడిసి ముద్దయిన రాజధాని
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేని వాన(Heavy Rain in Telangana)తో హైదరాబాద్ నగరం వణికిపోయింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కుండపోతగా కురవడంతో వందలాది కాలనీలు నీటమునిగాయి. నాలాలు, కాలువలు ఉప్పొంగాయి. రహదారులు ఏరులయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బహదూర్‌పుర చౌరస్తా నుంచి కిషన్‌బాగ్ వెళ్లే రహదారిలో నడుము లోతు నీరు నిలవడంతో స్థానికులు తాళ్ల సాయంతో రోడ్డు దాటారు. మాదాపూర్ ప్రాంతంలోనూ రహదారులపై మోకాల్లోతు నీరు చేరింది. గ్రేటర్ వ్యాప్తంగా సోమవారం రాత్రి వరకు 42 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్ జిల్లా చిట్యాలలో 16.13, సిరిసిల్ల జిల్లా నాంపల్లెలో 15.98, ఖమ్మం జిల్లా బచ్చోడులో 15.15 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 14.8, జమ్మికుంటలో 14.8, వీణవంకలో 14.3, వైరాలో 14.2, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 11.08 సెం.మీ.ల వర్షం కురిసింది.
పొంగిన వాగులు..
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది పాత వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని పల్లిపాడులో, కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. వైరా పట్టణం, చింతకాని మండలం నాగులవంచ గ్రామాల్లోని పలు వీధులు జలమయమయ్యాయి. భద్రాద్రి జిల్లా ఎల్చిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రహదారి కోతకు గురైంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు సాయమ్మ(40) అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్త గాయపడ్డాడు.
ఇదీ చదవండి :AP RAINS: గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు.. వరద నీటిలోనే ప్రజలు