APNGOs On PRC: తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7నుంచి ఉద్యోగుల శంఖారావం ప్రారంభించబోతున్నట్టు ఏపీ ఎన్జీవో నేతలు ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 10 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామని, 13న అన్ని చోట్లా నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఆందోళనలను జయప్రదం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు కృష్ణా జిల్లా ఉద్యోగ సంఘ నేతల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.