ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపాలి: ఏపీఎన్జీవో

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ తీరును ఏపీఎన్జీవో తీవ్రంగా తప్పుబట్టింది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు పెట్టాలనుకోవడం దుర్మార్గమని సంఘ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కరోనా తగ్గాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను ఆపాలని తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

apngo
apngo

By

Published : Nov 24, 2020, 6:35 PM IST

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఏపీఎన్జీవో అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఈసీ ప్రభుత్వ ఉద్యోగులతో చెలగాటం ఆడుతోందని సంఘ నేతలు ధ్వజమెత్తారు. విజయవాడలో జరిగిన ఎన్జీవో సంఘం వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ.... రోజుకూ వేల సంఖ్యలో కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు పెట్టాలనడం దుర్మార్గమన్నారు.

కరోనాతో ఇప్పటితే చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, ఎన్నికలు నిర్వహిస్తే మరింత మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. మీ స్వార్థం కోసం మా ప్రాణాలను బలి చేయవద్దని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పట్లో ఎన్నికలు వద్దని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు. ఎన్నికల వల్ల కరోనా బారిన పడి ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ఎస్ఈసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ ఆపాలని తాము కోర్టుకు కూడావెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా తగ్గాకే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details