రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) మరో బొగ్గు బ్లాక్‌ను దక్కించుకుంది. కేంద్ర ఉక్కు శాఖకు చెందిన మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన వేలంలో ఝార్ఖండ్‌లోని గిరిడి జిల్లాలో బ్రహ్మదిహ బ్లాక్‌ను బుధవారం సొంతం చేసుకుంది. 105 హెక్టార్లలోఉన్న బ్లాక్‌లో 2.215 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. ఉక్కు పరిశ్రమల్లో వినియోగించే బొగ్గు ఇక్కడ లభిస్తుంది. దీని ద్వారా ఏపీఎండీసీకి ఏటా రూ.25కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా. దీనిని దక్కించుకునేందుకు ఏపీఎండీసీ 41.75 శాతం రెవెన్యూ వాటా చెల్లించేలా కోట్ చేసింది. అంటే బొగ్గు ధరలో 41.75 శాతం మేర ఝార్ఖండ్ ఖనిజ శాఖకు చెల్లించాలి. ఇప్పటికే ఏపీఎండీసీకి మధ్యప్రదేశ్‌లోని సులేరి, ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్‌లో గనుల బ్లాక్‌లు ఉన్నాయి.
ఝార్ఖండ్‌లోని బొగ్గు బ్లాక్‌ను సొంతం చేసుకున్న ఏపీఎండీసీ - apdmc news
ఝార్ఖండ్‌లోని బొగ్గుగనిని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సొంతం చేసుకుంది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన వేలంలో ఈ గనిని చేజిక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ