APMDC: ఆ గని నుంచి 21 రోజుల్లో రూ.17 కోట్ల ఆదాయం: ఏపీఎండీసీ ఎండీ - ఏపీఎండీసీ లేటెస్ట్ అప్డేట్స్
APMDC: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్ల ఆదాయం వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు గని నుంచి కేవలం 21 రోజుల్లోనే రూ.17 కోట్లు ఆదాయం వచ్చిందని సంస్థ ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు.
APMDC: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు గనిలో గతనెల 10 నుంచి తవ్వకాలు మొదలుకాగా, 21 రోజుల్లో రూ.17 కోట్ల ఆదాయం పొందినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం ఈ బొగ్గు గని ద్వారానే 2022-23లో రూ.1,200 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లోని బ్రహ్మదియా బొగ్గు గనిలో నాలుగు నెలల్లో తవ్వకాలు ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగంపేట ముగ్గురాయి గనుల్లో గత ఏడాది 27 లక్షల ఖనిజం తవ్వి తీసినట్లు పేర్కొన్నారు. జగనన్న భూరక్ష-భూహక్కు పథకానికి అవసరమైన సర్వే రాళ్లను సరఫరా చేసేందుకు నాలుగు చోట్ల యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:జోరుగా "పిడకల యుద్ధం".. వేలాదిగా తరలి వచ్చిన జనం