ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరో రెండు బొగ్గు గనులపై ఏపీఎండీసీ దృష్టి - apmdc latest news

ఇతర రాష్ట్రాల్లో కొత్తగా మరో రెండు బొగ్గు గనులను దక్కించుకోవడంపై రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టింది. తాజాగా కేంద్రం 38 బ్లాకులకు బిడ్డింగ్ ప్రక్రియలో ఏపీఎండీసీ పాల్గొననుంది.

apmdc consontration on another two coal minings
మరో రెండు బొగ్గు గనులపై దృష్టి

By

Published : Jul 6, 2020, 9:42 AM IST

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఇతర రాష్ట్రాల్లో కొత్తగా మరో రెండు బొగ్గు గనులను దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఏపీఎండీసీకి రెండు గనులున్నాయి. తాజాగా కేంద్రం 38 బ్లాకులకు బిడ్డింగ్ నిర్వహిస్తోంది. వీటిలో ఏపీఎండీసీ పాల్గొననుంది. బిడ్డింగ్ నిర్వహించే బ్లాకుల్లో ఎంత మేరకు బొగ్గు నిల్వలున్నాయి? వాటిని తవ్వి తీసే అవకాశాలు, రవాణా తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

మెుత్తంగా 16 బ్లాకులకు బిడ్డింగు వేయనున్నారు. వీటిలో కనీసం రెండు బ్లాకులు దక్కవచ్చని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఏపీఎండీసీకి 2016 లో మధ్యప్రదేశ్ లోని సులేరిలో 1298 హెక్టార్లు, చత్తీస్​గఢ్ లోని మదన్​పూర్ లో 712 హెక్టార్ల మేర ఉన్న ఒక్కో బ్లాక్ ను కేంద్రం కేటాయించింది. ఇందులో సులేరిలో 108 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అంచనా. వీటిలో తవ్వకాలు వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details