ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఝార్ఖండ్​లోని బ్రహ్మదియా బొగ్గు గనిని చేజిక్కించుకున్న ఏపీఎండీసీ - State Mineral Development Corporation news

కేంద్ర బొగ్గు గనుల శాఖ వేలం వేసిన ఝార్ఖండ్​లోని బ్రహ్మదియా బొగ్గు గనిని రాష్ట్ర మినరల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్(ఏపీఎండీసీ) దక్కించుకుంది. ఏపీఎండీసీ తరపున గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మైనింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

APMDC acquires Brahmadeya coal mine
బ్రహ్మదియా బొగ్గు గనిని చేజిక్కించుకున్న ఏపీఎండీసీ

By

Published : Jan 11, 2021, 8:17 PM IST

ఝార్ఖండ్​లోని బ్రహ్మదియా బొగ్గు గనిని రాష్ట్ర మినరల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 19 గనుల్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ వేలం వేసింది. ఈ వేలంలో 14 మంది బిడ్డర్లు గనులను సొంతం చేసుకున్నారు. ఇందులో ఏపీఎండీసీ ఒక్కటే ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది.

దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఏపీఎండీసీ తరపున గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మైనింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బ్రహ్మదియా కోల్ బ్లాక్​లో కోకింగ్ కోల్ మైనింగ్ కోసం ఈ బిడ్డింగ్​ను దక్కించుకున్నట్టు ద్వివేది స్పష్టం చేశారు. కోకింగ్ కోల్​ను ఉక్కు కర్మాగారాల్లోని బ్లాస్ట్ ఫర్నెస్​లలో వినియోగిస్తారని ఆయన తెలిపారు. బొగ్గు మంత్రిత్వశాఖ వేలం వేసిన గనుల్లో బ్రహ్మదియాలో మాత్రమే కోకింగ్ కోల్ ఉత్పత్తికి అవకాశముందని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: సింగిల్​ బెంచ్ తీర్పు సుప్రీం నిబంధనలకు విరుద్ధం: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details