ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు సంయుక్తంగా డిమాండ్ చేశారు. విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ఇకపై ఉమ్మడిగా పోరాడాలని ఏపీజేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించినా.. తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'సమస్యల పరిష్కారానికి సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి' - ఏపీ ఉద్యోగుల సమస్యలు
వేతనాలు, పింఛన్ల ఆలస్యంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. నెలంతా కష్టపడిన వేతన జీవులకు ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు.. చాలామందికి ఏడో తేదీకీ ఇవ్వకపోవడం దారుణమని ఏపీజేఏసీ, అమరావతి జేఏసీ మండిపడ్డాయి. పీఆర్సీ, సీపీఎస్ విషయంలోనూ ఇంకెంత కాలం వేచిచూడాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
APJAC, APJAC amaravathi
ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్, జీతభత్యాలు చెల్లించాలని ఏపీజేఏసీ, అమరావతి జేఏసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీ సిఫారసులు వెంటనే అమలుపరచాలన్నారని కోరారు. తమ సమస్యలపై ఇకపై ఉమ్మడి పోరుకు సిద్ధమన్నారు.
ఇదీ చదవండి: