జల వివాదాలపై ట్రైబ్యునల్; కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి సహా అన్ని అంశాలతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను(మినిట్స్‌ను) కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 6న సమావేశమైంది. మినిట్స్‌పై అందరూ సంతకాలు చేసిన తర్వాతే సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు అమలులోకి వస్తాయి. కేంద్ర మంత్రి ఆమోదించిన తర్వాత జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులు రెండు రాష్ట్రాల సీఎంలకు పంపినట్లు తెలిసింది.
రెండు రాష్ట్రాలకూ అపెక్స్ కౌన్సిల్ మినిట్స్! - కృష్ణా, గోదావరి బోర్డు సమావేశం
జల వివాదాలపై ట్రైబ్యునల్; కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి సహా అన్ని అంశాలతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను(మినిట్స్‌ను) కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 6న సమావేశమైంది.
‘‘రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను అంతర్‌రాష్ట్ర నదీజలాల చట్టం-1956 ప్రకారం ప్రస్తుతం విచారణ జరుపుతున్న కృష్ణాజల వివాద ట్రైబ్యునల్-2కు అప్పగిస్తాం. లేదా కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తాం. న్యాయసలహా తీసుకున్న తర్వాతనే ఈ విషయంలో ముందుకెళ్తాం’’ అని కేంద్ర జల్‌శక్తి మంత్రి ఇచ్చిన హమీతో సహా అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించిన అన్ని అంశాలు ఇందులో ఉన్నట్లు తెలిసింది. బోర్డు పరిధిని నోటిఫై చేయడానికి తెలంగాణ అంగీకరించలేదు. పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫై చేయాల్సిన బాధ్యత కేంద్రానిదని కేంద్రమంత్రి చెప్పారు. ఇదే విషయాన్ని మినిట్స్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై రెండు రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేసేవరకు ఉత్కంఠ కొనసాగనుంది.
ఇదీచదవండి