ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై చర్చించేందుకు అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం ఈనెల 25న జరగనుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్​తో సమావేశం కానున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి తెలుగు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.

జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం
జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

By

Published : Aug 18, 2020, 9:52 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు అపెక్స్​ కౌన్సిల్ ఈ నెల 25వ తేదీన సమావేశం కానుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల పరిధి, ప్రాజెక్టుల డీపీఆర్​లు, గోదావరి జలాల్లో వాటా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తరలింపు అంశాలు ఎజెండాగా భేటీ జరగనుంది.

ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ మొదట ప్రతిపాదించింది.

అయితే.. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల వీలు పడదని, 20వ తేదీ తర్వాత నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తాజా పరిస్థితుల్లో ఈ నెల 25వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం జరగనుంది. 2016 సెప్టెంబర్ 21న అపెక్స్​ కౌన్సిల్ మొదటి సమావేశం జరిగింది. 25న జరిగే సమావేశం రెండో భేటీ అవుతుంది.

ఇవీ చూడండి:

కేటాయింపునకు మించి నీటిని వాడుకున్నారు: ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

ABOUT THE AUTHOR

...view details