ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Azharuddin: హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (Hca) అధ్యక్షుడు అజారుద్దీన్‌ (Azharuddin)పై వేటు పడింది. అజారుద్దీన్‌ హెచ్‌సీఏ సభ్యత్వాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ రద్దు చేసింది. హెచ్‌సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ చర్యలకు ఉపక్రమించింది.

HCA action on Azharuddin
అజారుద్దీన్‌పై హెచ్​సీఏ వేటు

By

Published : Jun 17, 2021, 12:33 AM IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hca) అధ్యక్షుడు అజారుద్దీన్​ (Azharuddin)పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్​సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో హెచ్​సీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అజార్​కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈనెల 2న అజార్​కు షోకాజ్ నోటీస్ ఇచ్చిన అపెక్స్ కౌన్సిల్... అజారుద్దీన్​పై ఉన్న కేసులు పెండింగ్​లో ఉన్నందున హెచ్​సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details