విద్యుత్ ఛార్జీలపై(టారిఫ్)పై ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అభ్యంతరాలను వర్చువల్ విధానంలో స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఛైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ వెల్లడించారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై నివేదికలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించాయన్నారు. వీటిపై సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, సభ్యులు పి. రాజమోహన్ రెడ్డి, ఠాకూర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు(ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్)కు సంబంధించిన బహిరంగ విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచే జరుగుతాయని ఆమె వివరించారు.
- ఫిర్యాదు ఎలా చేయాలంటే...?