ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APERC: చౌక విద్యుత్​ కొనుగోళ్లపై ఏపీఈఆర్​సీ నియంత్రణ

స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లపై.. ఏపీఈఆర్సీ నోటిఫికేషన్
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లపై.. ఏపీఈఆర్సీ నోటిఫికేషన్

By

Published : Feb 10, 2022, 9:10 PM IST

Updated : Feb 11, 2022, 5:50 AM IST

21:03 February 10

ఇకపై ఈఆర్సీ నియంత్రణలోనే స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు

చౌక విద్యుత్​ కొనుగోళ్లపై ఏపీఈఆర్​సీ నియంత్రణ

APERC: విద్యుత్ సంస్థల స్వల్పకాలిక కొనుగోళ్లు తమ నియంత్రణలోనే జరగాలని ఏపీ ఈఆర్​సీ స్పష్టంచేసింది. కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేయాలని ఆదేశించింది. స్వల్పకాలిక విద్యుత్‌ యూనిట్‌ ధర నిర్దేశించిన బెంచ్‌ మార్క్‌ ధర కంటే అధికంగా ఉంటే డిస్కంలే భరించాలని తేల్చిచెప్పింది.

రాష్ట్రంలో స్వల్పకాలిక కరెంటు కొనుగోళ్లకు సంబంబంధించి ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(AP ERC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక నుంచి విద్యుత్‌ సంస్థలు చేపట్టే స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు ఈఆర్​సీ నియంత్రణలోనే చేపట్టాలని స్పష్టంచేసింది. స్వల్పకాలిక కొనుగోళ్లకు సంబంధించి రియల్‌టైమ్‌, ఇంట్రాడే, ఒకరోజు ముందస్తు అంచనాలు, వారం, నెల రోజులకు సంబంధించిన కొనుగోళ్ల అంచనాల వివరాలను ఎప్పటికప్పుడు ఈఆర్​సీకి తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ధర అధికంగా ఉంటే డిస్కంలే భరించాలి
ఈ మేరకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికత సాయంతో స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(APSLDC) వీటిని అంచనా వేయాలని సూచించింది. స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్ల యూనిట్‌ ధర బెంచ్‌ మార్క్‌ ధర కంటే అధికంగా ఉంటే డిస్కంలే భరించాలని తెలిపింది. విద్యుత్‌ కొరత తీర్చేందుకు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నందున యూనిట్‌ ల్యాండింగ్‌ ధరపై ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేమంది. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరల్ని చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నందున... వినియోగదారులపై భారం పడుతోందని ఈఆర్​సీ అభిప్రాయపడింది. అత్యవసర కొనుగోళ్లతో ప్రతి యూనిట్‌ కొనుగోలు ధరపై ప్రభావం పడుతోందని స్పష్టంచేసింది. యూనిట్‌ ధరతో పాటు ట్రాన్స్‌మిషన్‌ డీవియేషన్‌ ఛార్జీల రూపంలో అదనంగా యూనిట్‌కు 25 పైసలు చెల్లించాల్సి వస్తోందని తెలిపింది.

సౌర, పవన విద్యుత్​తో గ్రిడ్‌పై భారం

స్వల్పకాలిక కొనుగోళ్ల కోసం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేసి బహిరంగ మార్కెట్‌, పవర్‌ ఎక్సేంజిల్లో కొనుగోలు చేయడం అనర్థమేనని ఈఆర్​సీ పేర్కొంది. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేయడం ద్వారా నిర్వహణా లోపాలు, మరమ్మతులకు అధిక వ్యయం చేయాల్సి వస్తుందని స్పష్టంచేసింది. సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్‌ ద్వారా వచ్చే ఉత్పత్తి నిరంతరం ఒ‍కేలా ఉండకపోవటం వల్ల... గ్రిడ్‌పై భారం పడుతోందని ఈఆర్​సీ తెలిపింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌ నుంచి స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని నోటిఫికేషన్‌లో వివరించింది. దీనికి సంబంధించి డిస్కంలు చేసుకునే ఒప్పందాలను నెల రోజులు ముందుగా తెలియజేయాలని స్పష్టంచేసింది.

ఇదీ చదవండి

Last Updated : Feb 11, 2022, 5:50 AM IST

ABOUT THE AUTHOR

...view details