ERC ORDERS TO REFUND TRUE UP CHARGES: ట్రూ అప్ ఛార్జీల విషయంలో ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు తిరిగి ఇవ్వాల్సిందిగా ఈఆర్సీ ఆదేశించింది. 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధనంగా వసూలు చేసిన ఛార్జీలను.. డిసెంబరు నెల విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేయాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని మూడు డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది.
ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం - విద్యుత్ వినియోగదారులకు శుభవార్త
13:09 December 02
ERC ORDERED DISCOMS TO REFUND TRUE UP CHARGES COLLECTED
ఏపీఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ లు ఇప్పటికే వినియోగదారుల బిల్లుల్లో వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను సర్దుబాటు చేశాయని.. సీపీడీసీఎల్ పరిధిలో ఇంకా సర్దుబాటు చేయాల్సి ఉందని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. వాస్తవానికి 2014-19 మధ్యలో వాడిన విద్యుత్‌పై రూ.3,699 కోట్లను ట్రూఅప్ ఛార్జీలుగా వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ డిస్కంలకు గతంలో ఆదేశాలు ఇచ్చింది. న్యాయపరమైన అంశాల విచారణ తర్వాత ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:
weather forecast: మరింత బలపడిన అల్పపీడనం.. సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం