ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జేఎన్టీయూ కాకినాడకు ఏపీఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలు - ఏపీఈఏపీసెట్‌ తాజా సమాచారం

APEAPSet‌ Management Responsibilities
ఏపీఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలు

By

Published : Aug 17, 2021, 3:10 PM IST

Updated : Aug 17, 2021, 6:18 PM IST

15:05 August 17

APEAPSet management responsibilities

ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) నిర్వహణ బాధ్యతను కాకినాడ జేఎన్‌టీయూకు విద్యా శాఖ అప్పగించింది. జూన్‌ 25న ఏపీఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల నమోదు పక్రియను జూన్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించింది. ఇంజినీరింగ్ పరీక్షను ఈనెల 19, 20, 23, 24, 25 తేదీల్లో.. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను  సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. 

మౌలిక సదుపాయాల అందుబాటు, కొవిడ్-19 మహమ్మారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలను 16 సెషన్లలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో 10 సెషన్లు ఇంజినీరింగ్.. ఆరు సెషన్లు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ పరీక్ష రద్దు చేసిననందున ఈఏపీసెట్‌ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఈఏపీసెట్‌-2021 పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,796 మంది అభ్యర్థులు ఇంజినీరింగ్, 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంపిక చేసుకున్నారు. 717 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటినీ ఎంచుకున్నారు.

ఇదీ చదవండీ..POLAVARAM: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన

Last Updated : Aug 17, 2021, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details