రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ యాదవ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీ నుంచి శ్రామిక్ రైళ్ల ద్వారా లక్ష మందిని తరలించడంపై అభినందనలు తెలిపారు. రైల్వేశాఖ నడుపనున్న 200 ప్రత్యేక రైళ్లలో 11 జతల సర్వీసులు రాష్ట్రం నుంచి వెళ్తున్నందున వాటి హాల్టులను మార్చాలని లేఖలో కోరారు. రైళ్ల ద్వారా ప్రయాణించే వారందరికీ టెస్టులు చేయటం కష్టం కాబట్టి... హాల్టులను పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైల్వే బోర్డు ఛైర్మన్‌కు సీఎస్ లేఖ - latest news on apcs
రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ యాదవ్‌కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. రైల్వేశాఖ నడుపనున్న 200 ప్రత్యేక రైళ్లలో రాష్ట్రం నుంచి వెళ్తున్న 11 జతల సర్వీసులు వాటి హాల్టులను మార్చాలని లేఖలో కోరారు.
ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్లో కోవిడ్ పరీక్షలు చేసేందుకు తాము ఏర్పాటు చేసిన వాటికే హాల్టులను పరిమితం చేయాలని కోరారు. సికింద్రాబాద్-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్ కు విజయవాడ, రాజమహేంద్రవరంలో... గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ విజయవాడ, గుంటూరులో నిలపాలని కోరారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కడప, గుంతకల్లులో... దిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ విజయవాడ, రాజమహేంద్రవరంలో... కోణార్క్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ, విశాఖలో నిలపాలని సీఎస్ లేఖలో విజ్ఞప్తి చేశారు.